: ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన చైనా వంతెన ప్రారంభం


పర్వతమయమైన నైరుతి చైనాలో యున్నన్, గిఝౌ ప్రావిన్స్ లను అనుసంధానం చేస్తూ నిర్మించిన వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన ఈ వంతెన.. భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున ఉంది. ఈ వంతెన నిర్మాణంతో యున్నన్, గిఝౌ ప్రాంతాల మధ్య ప్రయాణ కాలం కలిసొస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఇప్పటి వరకు నాలుగు గంటల సమయం పట్టేది. ఈ వంతెన నిర్మాణంతో ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గనుందని... కేవలం గంటలో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.1005 కోట్లు వ్యయం చేసినట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News