: ఊహించని మద్దతు... అఖిలేష్ కు దీదీ ఫోన్!
సమాజ్ వాదీ పార్టీలో కుటుంబకలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ ను అధినేత ములాయం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రెండు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. పార్టీలోని ఓ వర్గం అఖిలేష్ కు పూర్తి మద్దతు తెలుపుతోంది. పార్టీని చీల్చాల్సిందే అంటూ పట్టుబడుతోంది. ఈ క్రమంలో, యావత్ దేశం సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అఖిలేష్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దృఢ చిత్తంతో, ధైర్యంగా ముందుకు సాగాలని అఖిలేష్ కు ఆమె సూచించారు. పనిలోపనిగా శుభాభినందనలు తెలిపారు.