: నోట్ల రద్దు నిర్ణయం అంత హడావుడిగా ఎందుకు తీసుకున్నారు?: అమర్త్యసేన్
పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ మరోమారు విమర్శలు గుప్పించారు. అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని, ఇప్పటికీ, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక ప్రయోజనాలేవీ తనకు కనిపించడం లేదని అన్నారు. ఉన్నపళంగా నోట్లను రద్దు చేస్తే ఎదురయ్యే పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అమర్త్యసేన్ ప్రశ్నించారు.