: అఖిలేష్ కు మద్దతుగా ప్రారంభమైన రాజీనామాల పర్వం


సమాజ్ వాదీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ను సస్పెండ్ చేయడంపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాల పర్వం మొదలైంది. పార్టీ అధికార ప్రతినిధి జూహి సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ నుంచి ముఖ్యమంత్రిని సస్పెండ్ చేస్తే... అధికార ప్రతినిధి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధినేత ములాయం సింగ్ యాదవ్ పై తనకు వ్యతిరేకత లేదని... కానీ, అఖిలేష్ కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే మాట్లాడుతూ, యావత్ యూపీ ప్రజల మద్దతు అఖిలేష్ కే ఉందని తెలిపారు. ఆయన వెంట నడిచేందుకు అందరూ సిద్థంగా ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News