: మందుబాబులకు చీర్స్... ఈరోజు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు!


మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. బార్లలో అయితే రాత్రి ఒంటిగంట వరకు అమ్మకాలను అనుమతించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు, మందుబాబులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి గొడవలు చేయడం, ఇబ్బందికర చర్యలకు పాల్పడటం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News