: సీఎం చంద్రబాబు ఇడుపులపాయ పర్యటన షెడ్యూల్ ఖరారు!
జనవరి 4న కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆ వివరాలను ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి.
* 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు రాక
* 3.05 గంటలకు స్నాతకోత్సవ వేదికకు చేరుకుని.. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగశాల స్టాల్స్ పరిశీలన
* 3.40 గంటలకు స్నాతకోత్సవ వేదికపైకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రత్యేక డ్రెస్ ధరిస్తారు
* 3.50 గంటలకు వేదికపైకి చేరుకుని విద్యార్థులకు మెడల్స్ అందజేస్తారు
* 4.31 గంటలకు సీఎం ప్రసంగం. అనంతరం 4.56 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.