: 'శాతకర్ణి' వర్సెస్ 'ఖైదీ'... నాగబాబు ఏమన్నారు?


సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ అగ్రహీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీనికి తోడు అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్ ల కామెంట్లు అభిమానుల యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ వార్ పై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించారు.

సినిమా అంటే కేవలం హీరోకి మాత్రమే చెందినది కాదని నాగబాబు అన్నారు. వేలాది మంది కష్టపడితేనే ఒక సినిమా రూపుదిద్దుకుంటుందని... అలాంటి సినిమా ఫ్లాప్ అయితే వారంతా ఎంతో బాధపడతారని చెప్పారు. ఒకరి సినిమా హిట్ కావడం కోసం... మరొకరి సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోవడం మంచిది కాదని సూచించారు. సోషల్ మీడియాలో నెలకొన్న ఫ్యాన్స్ వార్ సరైంది కాదని చెప్పారు. సినీ పరిశ్రమకు ఇది ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు. సంక్రాంతికి రిలీజయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ అయి, అందరికీ సంతోషాన్ని కలిగించాలని ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News