: గనులకు వేలం... రూ. 50 వేల కోట్ల ఆదాయం మోదీ సర్కారు లక్ష్యం


కొత్త సంవత్సరంలో కేంద్ర ఖజానాకు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని చేరవేసే లక్ష్యంగా భారీ ఎత్తున గనుల తవ్వకం లైసెన్సులను మంజూరు చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టానికి సవరణలు చేయడం ద్వారా గనుల పంపకం చేపట్టాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. యూపీఏ హయాంలో చేపట్టిన బొగ్గు గనుల పంపకం చెల్లదని గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో, ఖనిజ, సహజ సంపద వెలికితీత పనులను వేలం ద్వారానే నిర్వహించాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుబాటులోని ఇనుము తదితర ఖనిజాలను వేలం వేయడం ద్వారా అర లక్ష కోట్లను సమీకరించవచ్చని అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News