: కొత్త వెయ్యి నోట్లు... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్పెసిమన్ కరెన్సీ!


కొత్త వెయ్యి రూపాయల నోట్లు భారీగా ముద్రితమవుతున్నాయని, త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. నవంబర్ 8కి ముందు సామాజిక మాధ్యమాల్లో రూ. 2 వేల నోట్లపై వార్తలు వచ్చినట్టుగానే, ఇప్పుడు రూ. 1000పై ప్రచారం జరుగుతోంది. ఆర్బీఐ పెద్దఎత్తున వీటిని ముద్రిస్తోందని చెబుతూ, కొన్ని చిత్రాలు షేర్ల మీద షేర్లు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి నోట్లు లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయి. కాగా, నోట్ల రద్దు తరువాత, కొత్త డిజైన్, రూపంలో రూ. 1000 నోట్లను తిరిగి ప్రవేశపెడతామని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త వెయ్యి ఇవేనా? అన్న ప్రశ్నకు అధికారికంగా సమాధానం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News