: 2017 తొలి శుభవార్త... ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితి పెంపు!


కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు తొలి శుభవార్తను అందిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితిని పెంచింది. విత్ డ్రా పరిమితిని మరో రూ. 2 వేలు పెంచుతున్నట్టు తెలిపింది. అంటే, నేటి వరకూ రోజుకు రూ. 2,500 వరకూ విత్ డ్రా పరిమితి ఉండగా, రేపటి నుంచి, అంటే 1వ తేదీ నుంచి రోజుకూ రూ. 4,500 వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి వారానికి విత్ డ్రా పరిమితి రూ. 24 వేలు సహా మిగతా అన్ని ఆంక్షలూ కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. నగదు కష్టాల మధ్య చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆర్బీఐ నిర్ణయం కాసింత ఉపశమనమే!

  • Loading...

More Telugu News