: ఒబామాలా స్థాయిని దిగజార్చుకోలేను: పుతిన్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలా తన స్థాయిని దిగజార్చుకోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో పనిచేస్తున్న 35 మంది రష్యా దౌత్య అధికారులను అమెరికా బహిష్కరించిన వెంటనే రష్యాలోని 35 మంది ఎంబసీ అధికారులను తొలగించడంతో పాటు మాస్కోలోని ఆంగ్లో-అమెరికన్ స్కూలును కూడా రష్యా మూసివేయించినట్టు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడదల చేశారు.

అందులో తమ దేశంలో పని చేస్తున్న అమెరికా దౌత్య అధికారులను బహిష్కరించమని పేర్కొన్నారు. వారిని బహిష్కరించడం ద్వారా తమ స్థాయిని దిగజార్చుకోమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఈ రెండు దేశాల వైఖరిని గమనిస్తున్న పరిశీలకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా దౌత్య సంబంధాల్లో ఒక దేశం చర్యలకు ఉపక్రమించగానే ఆ చర్యలకు ప్రతీకారంగా ప్రత్యర్థిదేశం చర్యలు చేపడుతుంది. అయితే రష్యా తీరు ప్రస్తుతానికి కొరుకుడుపడనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఒబామా రష్యా ఎంబసీపై తీసుకున్న చర్యలను ట్రంప్ కూడా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News