: కాశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్ అరెస్టు
కాశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ప్రార్థనల అనంతరం షోపియాన్ జిల్లాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన ర్యాలీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా, పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థులకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం స్థిర నివాస సర్టిఫికెట్లను ఇటీవల మంజూరు చేసింది. దీనిని నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.