: చిరంజీవితో హీరోయిన్ గా నటించలేకపోయా: నటి సులక్షణ
చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించలేకపోయానని నాటి కథానాయిక సులక్షణ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చిరంజీవి మంచి డ్యాన్సర్ అని, తాను కూడా క్లాసికల్ డ్యాన్సర్ ని అని, ఆయనతో నటించాను కానీ, హీరోయిన్ గా మాత్రం నటించలేకపోయానని అన్నారు.
‘బేబీ డాలీ’గా బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన తాను, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శుభోదయం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యానని చెప్పుకొచ్చారు. తన అసలు పేరు శ్రీదేవి అని, అప్పటికే ఒక శ్రీదేవి చిత్ర రంగంలో ఉండటంతో..తన పేరును సులక్షణగా మార్చారని అన్నారు.