: భూమి దగ్గరకు వచ్చివెళ్లాక.. 'శని'పై తుపాను


శని వస్తే.. ఎవరి జీవితంలోనైనా తుపాను వచ్చేస్తుందని అనుకుంటాం. అదే భూమి సమీపానికి వచ్చి వెళ్లే సరికి శనికే పెను తుపాను వచ్చింది. విషయం ఏంటంటే.. రెండు రోజుల కిందట శనిగ్రహం భూమికి అత్యంత చేరువకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా మన కంటితోనే చూడగలిగేంత దగ్గరగా శనిగ్రహం వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే భూమినుంచి దూరం జరిగిన రెండు రోజుల్లోనే శని గ్రహం మీద భారీ తుపాను వచ్చిందిట.

రెండువేల కిలోమీటర్ల మేర విస్తరించిన తుపాను భూమి మీద సంభవించే సగటు తుపాను కంటె 20 రెట్లు పెద్దదిగా ఆ గ్రహం మీద వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించి నాసా వారి క్యాసిని అంతరిక్ష నౌక చాలా స్పష్టమైన ఫోటోలను కూడా తీసి పంపిందిట. షడ్భుజి లాగా ఏర్పడిన ఈ తుపాను చుట్టూ.. సెకనుకు 150 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి మేఘాలు దూసుకెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Loading...

More Telugu News