: ఆన్ లైన్ షాపింగ్ చేసిన ఆరేళ్ల చిచ్చరపిడుగు!
అమెరికాలోని ఆర్కన్సాస్ కి చెందిన ఆష్ లిండ్ హోవెల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తల్లికి తెలియకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్రిస్మస్ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన పోకేమాన్ బొమ్మలు కొనుక్కోవాలని ఆ చిన్నారి భావించింది. అందుకు ఆన్ లైన్ షాపింగ్ ఎంచుకుంది. దాంతో, అమ్మ ఎప్పుడెప్పుడు నిద్రలోకి జారుకుంటుందా? అని ఎదురు చూసింది.
కాసేపయ్యాక ఆమె అలా నిద్రకు ఉపక్రమించిన తరువాత ఆమె ఐఫోన్ తీసుకుని, ఆమె వేలి ముద్రతో ఫోన్ అన్ లాక్ చేసింది. అందులో ఉన్న షాపింగ్ యాప్ అమెజాన్ లో తనకు కావాల్సిన 13 పోకెమాన్ బొమ్మలు ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చినట్లు, డెలివరీకి వస్తున్నట్టు నోటిఫికేషన్లు రావడం చూసిన బెథానీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురైందని భావించింది. ఇంతలో ఆష్ లిండ్ అమ్మకు అసలు విషయం చెప్పేసింది. అది వినగానే ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఇకపై కూతురుతో జాగ్రత్తగా ఉండాలని బెథానీ నిర్ణయించుకుంది. తాను ఆర్డర్ చేసిన పోకేమాన్ బొమ్మల్లో నాలుగు వెనక్కి ఇచ్చేసి, 9 తనవద్దే ఆష్ లిండ్ ఉంచుకుంది.