: ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ


కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. మున్సిపల్ దుకాణాన్ని (బీ7) అద్దెకిచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వర్గీయులు రంగయ్య, వెంకటరాముడు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లారు. వారి వెంట వైఎస్సార్సీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య కూడా ఉన్నారు.
అయితే, ‘మా పార్టీ అధికారంలో ఉంటే, మీరెలా దరఖాస్తు చేస్తారు?’ అంటూ టీడీపీ ఇన్ ఛార్జి పరమేశ్ వర్గీయులు వైఎస్సార్సీపీ వారిని అడ్డుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఘర్షణకు దారి తీసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
 

  • Loading...

More Telugu News