: తిరుపతిలో ఫైనాన్షియర్ కిడ్నాప్... చిత్రహింసలకు గురి చేసి నగదు లాక్కున్న దుండగులు!


తిరుపతిలో ఒక పెద్ద ఫైనాన్షియర్ ను దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన కలకలం రేపింది. సదరు ఫైనాన్షియర్ ను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా, ఆయన వద్ద ఉన్న 200 గ్రాముల బంగారం, లక్షన్నర రూపాయల నగదు లాక్కుని విడిచిపెట్టారు. అనంతరం, తిరుపతి అర్బన్ ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి చెందిన ముఠా ఈ కిడ్నాప్ నకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ సూత్రధారిని తిరుపతి వాసిగా గుర్తించామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News