: 'ఈ ప్రశ్న మా పెళ్లయ్యాక అడగండి' అంటూ అభిమానికి సూచించిన సమంత


టాలీవుడ్ అగ్రకథానాయక సమంత యువనటుడు నాగచైతన్యను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే భార్యాభర్తలిద్దరూ కుటుంబ ఫంక్షన్లలోను, స్నేహితుల పార్టీల్లోను జంటగా సందడి చేస్తున్నారు. నేడు ఫేస్ బుక్ లైవ్ లో సమంత అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని, 'ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇంటికోడలు అన్న అనుభూతి ఎలా ఉంది?' అని ప్రశ్నించాడు.

దీనికి ఈ ముద్దుగుమ్మ సమాధానమిస్తూ, పెళ్లి తరువాత ఈ ప్రశ్న అడగాలని తెలిపింది. తనకు ఈ ఏడాది దంగల్ బాగా నచ్చిన సినిమా అని చెప్పింది. తెల్లవారు జాము 4:30 నిమిషాలకు నిద్రలేచి చదువుతానని చెప్పింది. 2017లో 6 సినిమాలు తనవి రిలీజయ్యే అవకాశం ఉందని సమంత తెలిపింది. ఓడిపోతానేమోనని అప్పుడప్పుడు ఆందోళన చెందుతానని పేర్కొంది. 

  • Loading...

More Telugu News