: మమతా బెనర్జీకి కేంద్రం షాక్.. చిట్ ఫండ్ కుంభకోణం కేసులో పార్టీ ఎంపీ అరెస్టు


రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. కోల్ కతాలో సీబీఐ కొన్ని గంటల పాటు ఆయన్ని ప్రశ్నించిన అనంతరం తపస్  పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే కేసు వ్యవహారంలో ‘తృణమూల్’కు చెందిన మరో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయకు సీబీఐ సమన్లు జారీ చేసింది. కాగా, పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రధాని మోదీపైన, కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ సంఘటనతో కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లయింది. 

  • Loading...

More Telugu News