: మూగ జీవాలైతేనేం, వాటికీ మనసుంది!... హృదయాలను కదిలిస్తున్న ఫొటో!
అంతవరకూ కలిసున్న తమను.. బలవంతంగా విడదీసి.. వేరు వేరు గమ్యాలకు తరలించి వేస్తుంటే.. మూగజీవాలైన రెండు ఏనుగులు.. ఆ బంధాన్ని తెంచుకోలేక.. బరువెక్కిన హృదయాలతో సెలవు చెప్పుకుంటున్న వైనాన్ని చూసిన బెంగళూరుకు చెందిన సౌమ్య విద్యాధర్ అనే మహిళ చలించిపోయారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. భారతదేశంలోని ఓ జాతీయరహదారిపై తీసిన ఈ ఫొటో తన హృదయాన్ని కదిలించి వేసిందని ఆ పోస్ట్ లో ఆమె పేర్కొన్నారు. రెండు ఏనుగులు తమ తొండాలు సాచి పరస్పరం ప్రేమగా పలుకరించుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి కామెంట్స్ వచ్చాయి. జంతువులను తరలించడంపై కొందరు నెటిజన్లు మండిపడగా, ఈ ఫొటో తమ మనసును కదిలించిందని మరికొందరు పేర్కొన్నారు.