: కశ్మీర్ లో మళ్లీ అల్లర్లు... పలువురికి గాయాలు


జమ్ముకశ్మీర్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పుల్వామా జిల్లాలోని గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అంతేకాదు, తనిఖీల్లో భాగంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ సమయంలో, భద్రతాదళాలపై అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. వారిని అదుపు చేయడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. 

  • Loading...

More Telugu News