: తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన ఫెదరర్


ఇప్పటికిప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రకటించాడు. మరో మూడు, నాలుగేళ్ల పాటు టెన్నిస్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. అయితే, ఇంతకు ముందులా ఆ ఫామ్ కనబరుస్తానో, లేదో అనే విషయాన్ని మాత్రం చెప్పలేనని అన్నాడు. గత జులైలో వింబుల్డన్ సందర్భంగా ఫెదరర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను ఒక్క గేమ్ కూడా ఆడలేదు. జనవరి 1- 7 మధ్య పెర్త్ లో జరిగే హాప్ మన్ కప్ టీమ్ ఈవెంట్ లో ఫెదరర్ మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. మెన్స్ సింగిల్స్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఫెదరర్ చాలా కాలం పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగాడు. ప్రస్తుతం అతను 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.   

  • Loading...

More Telugu News