: అలాంటి ప్రొఫెసర్లను నరికి చంపుతాం: గుంటూరు మెడికల్ కాలేజీకి లేఖ
గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. కాలేజీలో ప్రొఫెసర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని... వారిని క్షమించే ప్రసక్తే లేదని గుర్తు తెలియని వ్యక్తులు లేఖలో హెచ్చరించారు. మెడికోల నుంచి ప్రొఫెసర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని... అలాంటి వారిని నరికి చంపుతామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో ఈ లేఖ వచ్చింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.