: నటి శ్రియ, భార్య రమ్యల మధ్యలో క్రిష్!


ప్రముఖ దర్శకుడు క్రిష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో ఇటీవల ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. అంతగా ఆసక్తి గొలుపుతున్న ఆ ఫొటో గురించి చెప్పాలంటే..  నటి శ్రియ, భార్య రమ్యల మధ్యలో దర్శకుడు క్రిష్ నిలబడి ఉన్నాడు. క్రిష్ కు భార్య రమ్య ముద్దుపెడుతుంటే.. నటి శ్రియ మాత్రం క్రిష్ గొంతును తన రెండు చేతులతో పట్టుకుని నవ్వుతూ ఫొటోకు పోజ్ ఇచ్చింది. కాగా, తిరుపతిలో ఇటీవల నిర్వహించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో క్రిష్ తన భార్య గురించి ప్రస్తావించడం తెలిసిందే. తన పెళ్లి అయిన తర్వాత భార్యతో కలిసి పట్టుమని పదిరోజులు కూడా ఉండలేదని, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే సమయం కేటాయించలేదని, భార్యగా తన జీవితంలోకి వచ్చిన రమ్యకు ధన్యవాదాలని క్రిష్ పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News