: సిడ్నీ నూతన సంవత్సర వేడుకలకు బాంబు బెదిరింపు.. ఒకరి అరెస్ట్!


ప్రతిఏటా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించే ఆస్ట్రేలియా 2017వ సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి, వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభించింది. వేడుకలకు ఇంకా ఒకరోజు మూడు గంటల 20 నిమిషాలు సమయం ఉందని పేర్కొంటూ స్టాప్ వాచ్ ను సిద్ధం చేసింది. హార్బర్ వింటేజ్ పాయింట్ వద్ద భారీ ఎత్తున బాణా సంచా కాల్చేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రపంచంలో ప్రతి ఏటా ముందుగా నూతన సంవత్సర వేడుకలు ఆస్ట్రేలియాలోనే మొదలవుతాయన్న సంగతి విదితమే. ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున దేశవిదేశాల పర్యాటకులు సిడ్నీకి చేరుకున్నారు.

కాగా, సిడ్నీ నూతన సంవత్సర వేడుకల్లో బాంబులు పేలుతాయని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పేర్కొన్నారు. దీంతో అతనిని సిడ్నీ ఎయిర్ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి అప్పుడే లండన్ నుంచి వచ్చాడని వారు తెలిపారు. తరువాత సిడ్నీలోని ఓ ఇంటిపై దాడి చేసిన భద్రతాధికారులు వివిధ పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అంతకు మించిన వివరాలు వారు వెల్లడించకపోవడం విశేషం. కాగా, క్రిస్మస్ సందర్భంగా తెరతీసిన పెను కుట్రను భగ్నం చేశామని ఆస్ట్రేలియా పోలీసులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News