: శ్రద్ధా కపూర్, ఫర్హాన్ ల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్!
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా పాప్యులర్ అయిన అంశాల్లో ఒకటి... నటుడు ఫర్హాన్ అఖ్తర్, నటి శ్రద్ధా కపూర్ ల ప్రేమాయణం. శ్రద్ధా కోసమే తన భార్యకు ఫర్హాన్ విడాకులు ఇచ్చాడని... ఫర్హాన్ ఇంటికే శ్రధ్ధా తన మకాం మార్చేసిందని... ఇలా ఎన్నో కథనాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, వీరి లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఫర్హాన్ ఇంట్లోనే సెటిల్ అయిపోయిన శ్రద్ధాను ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శక్తి కపూర్ బయటకు లాక్కొచ్చాడనేది తాజా వార్త. ఈ విషయంపై శక్తికపూర్ ను మీడియా ప్రశ్నిస్తే... 35 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఇలా ప్రవర్తిస్తానని మీరు నమ్ముతారా? అని ప్రశ్నించాడు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పాడు. అయితే, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం నచ్చకే శక్తి కపూర్ తన కుమార్తెను బలవంతంగా లాక్కొచ్చాడనే వాదనలు వినిపిస్తున్నాయి.