: జనవరి 3 వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా... 11 వరకు సమావేశాల పొడిగింపు


తెలంగాణ శాసనసభ సమావేశాలను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, వచ్చే నెల 11వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ ఛాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు విపక్ష సభ్యులు జానారెడ్డి, కిషన్ రెడ్డి, సున్నం రాజయ్య, అక్బరుద్దీన్ ఒవైసీలు హాజరయ్యారు. జనవరి 3, 4, 5, 6, 9, 11 తేదీల్లో సమావేశాలను నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధి, 4న బోధన రుసుములు, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించారు. 

  • Loading...

More Telugu News