: పొట్టతో అసహ్యంగా కనిపిస్తున్నారా?.. ఈ చిట్కాలు పాటించండి!


మన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మనపై ఎంతో ప్రభావం చూపుతాయి. మనకు తెలియకుండానే శారీరకంగా, మానసికంగా మనలో ఎన్నో మార్పులు తీసుకు వస్తాయి. మనం తేరుకునే లోగానే జరగాల్సింది జరిగిపోతోంది. ప్రస్తుత కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ బాధ పడుతున్న సమస్య అధిక పొట్ట. కొందరికి శరీరం అంతా లావుగానే ఉంటుంది. మరికొంత మందికి శరీరం మొత్తం బాగుంటుంది... కానీ, పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ ప్రదేశంలో పేరుకుపోతున్న కొవ్వే. ఏం బాధ పడాల్సిన అవసరం లేదు. కింద సూచించిన చిట్కాలను ప్రయత్నించి చూడండి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండి. దీనివల్ల మెటబాలిజం పెరిగి, ఒంట్లోని క్యాలరీలు కరిగిపోతాయి.
  • ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో అల్లం రసం కలుపుకుని తాగండి. దీని వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 
  • ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో నిమ్మకాయను పిండి తాగండి. అవసరమైనే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. నిమ్మకాయకు కొవ్వును కరిగించే అద్భుత శక్తి ఉంది. 
  • ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినండి. టమోటాలో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగించివేస్తుంది. 

  • Loading...

More Telugu News