: అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పిన నటుడిని చంపేస్తామంటూ బెదిరింపులు


తమిళంతో పాటు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించిన నటుడు ఆనంద్ రాజ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామంటూ ఫోన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బెదిరిస్తున్నారు. దీంతో, చెన్నైలోని నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాజ్ ఇంటికి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఫోన్ ఎవరు చేశారన్న విషయంపై దర్యాప్తును ప్రారంభించారు. జయలలిత చనిపోయిన తర్వాత ఆన్నాడీఎంకేలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని... అమ్మకు గౌరవం లేకుండా పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని... ఈ పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని, పార్టీ నుంచి వైదొలగుతున్నానని ఆనందరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News