: ఢిల్లీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో దోపిడీ... కీలక డాక్యుమెంట్ల చోరీ


ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా కార్యాలయంలో నిన్న రాత్రి దోపిడీ జరిగింది. తూర్పు ఢిల్లీలోని పత్పర్ గంజ్ లో ఉన్న శిసోడియా కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు... కంప్యూటర్ ను, కీలకమైన డాక్యుమెంట్లను ఎత్తుకుపోయారు. అంతేకాదు, సీసీటీవీల ఫుటేజీని కూడా తమతోపాటే తీసుకుపోయారు.

ఉదయం ఆఫీసుకు వచ్చిన సిబ్బంది... చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్వాడ్ తో వచ్చిన పోలీస్ సిబ్బంది... శిసోడియా కార్యాలయాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్ ను సేకరించారు. జరిగిన ఘటనపై ఆప్ నేత పంకజ్ సింగ్ మాట్లాడుతూ, లెటర్ హెడ్స్, రెండు కంప్యూటర్ల సీపీయూలు ఎత్తుకుపోయారని చెప్పారు. 

  • Loading...

More Telugu News