: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన బొగ్గుగని.. పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయిన కార్మికులు
జార్ఖండ్‌లోని గోదా జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర ప్రమాదం సంభవించింది. లాల్మాటియా ప్రాంతంలోని బొగ్గుగని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గనిలో పనిలో ఉన్న దాదాపు 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ ఎఫ్ సిబ్బంది పట్నా నుంచి ఘటనా స్థలానికి బయలుదేరాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.