: యాదాద్రిలో అంతర్జాతీయ పతంగుల పండుగ.. పాల్గొననున్న 5 వేల మంది
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వచ్చే నెల 16న అంతర్జాతీయ స్థాయి పతంగుల పండుగ(కైట్ ఫెస్టివల్) నిర్వహించనున్నారు. యాదాద్రి గుట్టకు ఎదురుగా ఉన్న విశాలమైన పెద్ద గుట్టపై కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఆఘాఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. పతంగులు ఎగురవేయడంలో తలపండిన విదేశీయులు ఈ పండుగలో పాలుపంచుకోనున్నారని, మొత్తం 5 వేల మంది కైట్ ఫెస్టివల్‌కు హాజరుకానున్నారని ఈవో గీతారెడ్డి తెలిపారు.