: 'పోలవరం'లో మత్స్యయంత్రం.. రూపొందించిన తెనాలి శిల్పి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే శంకుస్థాపనలో మత్స్యయంత్రాన్ని ఉపయోగించబోతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పి అక్కల శ్రీరామ్ దీనిని రూపొందించారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్పిల్‌వే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శంకుస్థాపనలో మత్స్యయంత్రాన్ని ఉపయోగించాలన్న సిద్ధాంతి రాఘవయ్య సూచనల మేరకు ప్రభుత్వం దాని తయారీని శిల్పి శ్రీరామ్‌కు అప్పగించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో ఉపయోగించిన శీతల యంత్రాన్ని కూడా శ్రీరామే రూపొందించడం గమనార్హం.