: అధికార మార్పిడికి ఒబామా అడ్డంకులు సృష్టిస్తున్నారు.. ఆరోపించిన ట్రంప్
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధికార మార్పిడి సజావుగా జరగకుండా ఆయన అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని ఆశించిన తనకు ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒబామా రెచ్చగొట్టే ప్రకటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతామండలి ఆమోదించిన తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా గైర్హాజరు కావడం బాధాకరమని ఒబామా అన్నారు.