: అప్పట్లో భూమండలం కుళ్లిన గుడ్ల వాసనే
19 కోట్ల సంవత్సరాల కిందట భూమండలంపై కుళ్లిన గుడ్ల వాసన వస్తుండేదిట. ఈ విషయాన్ని తాజాగా ఓ శాస్త్రవేత్తల బృందం.. ప్రాచీన అవశేషాలను పరిశీలించి తేల్చిచెప్పింది. జీవజాలం ఏర్పడిన తొలిరోజుల్లో ఒక జీవిని మరొకజీవి చంపి తినడం మొదలైన తొలిరోజుల్లో ఇలాంటి వాసన వస్తుండేదని తేల్చింది.
కెనడాలోని సుపీరియర్ సరస్సు చుట్టూఉన్న బండరాళ్ల మీది అవశేషాలు.. తొలినాళ్లలో ఒకదానినొకటి చంపితినే జీవజాలానికి సంబంధించిన ఆనవాళ్లను వీరికి అందించాయి. వాటిని పరిశోధిస్తున్న సమయంలోనే తొలినాళ్లలో భూమి కుళ్లిన గుడ్ల వాసనతో ఉండేదని వారు తేల్చారు.
ఆస్ట్రేలియా, నార్వే యూనివర్సిటీలకు చెందిన డాక్టర్ డేవిడ్ వేసీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ బ్రేసియర్ ల సారథ్యంలోని బృందం ఈ విషయంలో పరిశోదనలు చేసింది. ఈ పరిశోధనలో తొలిసారిగా తాము.. ఏ జీవులను మరే జీవులు తింటూ ఉండేవో గుర్తించినట్లు తెలిపారు.