: పదవీ విరమణ రోజే పింఛను ప్రయోజనాలు... లేకపోతే నేరమే!: తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు పింఛను చెల్లింపులపై ఆర్థిక శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే వారికి పింఛను ప్రయోజనాలు అందజేయాలని పేర్కొంది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతకర అంశంగా పరిగణించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎవరైతే పదవీ విరమణ చేయబోతున్నారో వారికి సంబంధించిన పింఛను పత్రాలు అన్నీ ఆరు నెలల ముందే సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలా ఏ ఉద్యోగికి సంబంధించిన పత్రాలైనా సిద్ధం చేయని పక్షంలో అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.