: రాహుల్ కు ఎలా ప్రవర్తించాలో సోనియా నేర్పించాలి: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్


ఎలా ప్రవర్తించాలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేర్పించాల్సిన అవసరం ఉందని, అతనిలోని చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని వదిలించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లెక్కల్లో చూపని నగదు కలిగి ఉన్న గుజరాత్ వ్యాపారి మహేశ్ శర్మతో మోదీ, అమిత్ షాకు సంబంధాలు ఉన్నట్లు  ఆరోపణలు చేస్తే సరిపోదని, ఆధారాలు చూపించి మాట్లాడాలని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవని, నల్లధనంపై చేసే పోరాటం వల్ల తమకు ఇబ్బంది తప్పదని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.

  • Loading...

More Telugu News