: ‘కాటమరాయుడు’ కొత్త పోస్టర్లపై సాయి ధరమ్, వరుణ్ తేజ్ ల స్పందనలు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించి తాజాగా మరో రెండు పోస్టర్లను ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. పంచెకట్టులో ఉన్న పవన్ కల్యాణ్ పోస్టర్ సూపర్.. అంటూ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా, పవన్ మేనల్లుడు యువ హీరో అయిన సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ‘ఆ పంచకట్టు ఏదైతే ఉందో!!!! దానికి ఈలలే ఈలలు’ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
ఈ ట్వీట్ కు ప్రతిస్పందించిన నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ ..‘ఈ పోస్టర్ చూస్తుంటే ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా! చూడాలనే ఉత్సాహం ఉరకలేస్తోంది’ అని అన్నాడు. ఇక, సినీ నిర్మాతబండ్ల గణేశ్, దర్శకుడు హరీశ్ శంకర్ కూడా తమ ట్వీట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.