: అలా ఆలోచిస్తే, నిరాశ అనేది మన దరి చేరదు: నటుడు అరవింద్ స్వామి
దేనిపైన అయినా అంచనాలు వేసుకోకుండా ఉంటే, నిరాశ అనేది మనదరి చేరదని ప్రముఖ నటుడు అరవింద్ స్వామి అన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’ వేదికగా తన అభిమానులతో ఈరోజు మాట్లాడారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు అరవింద్ స్వామి తనదైన శైలిలో స్పందించారు. అందం అనేది చూసే కళ్లను బట్టి ఉంటుందని, క్రికెటర్ జీవిత కథ ఆధారంగా నటించే అవకాశం తనకు లభిస్తే, కపిల్ దేవ్ పాత్రను ఎంచుకుంటానని, మాల్దీవులు తనకు ఇష్టమైన పర్యాటక ప్రాంతమని ఆయా ప్రశ్నలకు సమాధానాలుగా చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా.. ‘వాళ్లిద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోలేము’ అని అరవింద్ స్వామి స్పష్టంగా చెప్పారు.