: కేసీఆర్ వ్యాఖ్యలపై తమ్మినేని మండిపాటు
సీపీఎంని 'గుండుసూది' పార్టీ అంటూ వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ పై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న తమవి దిక్కుమాలిన ఉద్యమాలు కావని అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని సాగిస్తామని, ఇంకా ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ భూ సేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందినట్టు ప్రకటించుకోవడం రైతులకు, పేదలకు అన్యాయం చేసినట్లేనని విమర్శించారు.