: భారీ స్కోర్లు చేసిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు...డ్రా దిశగా రెండో టెస్టు
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్లు అద్భుతంగా రాణించాయి. రెండు జట్లు హోరాహోరీ పోరాటంతో భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో అజహర్ అలీ 205 పరుగులతో రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ కు దీటుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ (144), స్టీవ్ స్మిత్ (100) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 465 పరుగులు చేసింది. ఇంకా చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో రెండో టెస్టు డ్రా దిశగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ టూర్ లో పాక్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది.