: ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలవాలంటే... చరిత్రను తిరగరాయాలి!


పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ లో లంక బ్యాట్స్‌ మన్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ అనంతరం సఫారీ జట్టు 488 పరుగుల భారీ టార్గెట్‌ ను శ్రీలంకకు నిర్దేశించింది. అయితే నాలుగో రోజు ఆటలో 70 ఓవర్లతో పాటు, చివరి రోజు ఆట కూడా ఇంకా మిగిలే ఉంది. నేడు లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా శ్రీలంక జట్టు 27 పరుగులు చేసింది. దీంతో ఇంత భారీ మొత్తంలో పరుగులు చేయాలంటే లంకేయులు చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది. గతంలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై 410 పరుగులు అత్యధికంగా చేసింది. సఫారీలపై అయితే లంకేయులు గరిష్ఠంగా 306 పరుగులు మాత్రమే గతంలో చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు సఫారీలు నిర్దేశించిన 488 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగితే....శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు నమోదవుతుంది. అయితే సౌతాఫ్రికా బౌలర్లు మంచి ఫాంలో ఉండడంతో శ్రీలంక ఆశలు నెరవేరుతాయా? అన్నది అనుమానమే! 

  • Loading...

More Telugu News