: దుబాయ్ బీచ్ లో తన మాజీ భార్య, ఇద్దరు కుమారులతో హృతిక్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సూసానే ఖాన్ రెండేళ్ల క్రితం విడిపోయినప్పటికీ, తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలవటం, సరదాగా పర్యటనలు చేస్తుండటం తెలిసిందే. క్రిస్మస్ వేడుకల నిమిత్తం ఇటీవల ఫ్రెంచ్ ఆల్ప్స్ లో వారు గడిపారు. తాజాగా,
తన మాజీ భార్య సూసానే ఖాన్, ఇద్దరు పిల్లలతో కలిసి హృతిక్ రోషన్ దుబాయ్ బీచ్ లో దర్శనమిచ్చాడు. తన పిల్లలతో సరదాగా గడిపాడు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అక్కడికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సూసానే ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘చాలా సంతోషకరమైన రోజు’ అని ఆ పోస్ట్ లో పేర్కొంది.