: టీవీ నటుడు వెంకీ కారుకు యాక్సిడెంట్!
టీవీ నటుడు వెంకీకి తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి హైదరాబాదుకు స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా ఆయన కారుకు యాక్సిడెంట్ అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండల సరిహద్దులో ఓ ఆర్టీసీ బస్సు వెంకీ కారును ఓవర్ టేక్ చేసింది. దీంతో, తన కారును కొంచెం స్లో చేయగా, వెనుక నుంచి వచ్చిన ఇన్నొవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకీ క్షేమంగా బయట పడ్డాడు. ఇన్నొవా కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆలేరు పోలీస్ స్టేషన్ లో వెంకీ ఫిర్యాదు చేశాడు.