: చేపను పడితే.. మొసలి వెంటబడింది!


ఆస్ట్రేలియాలో చేపలు పట్టడం హాబీ...బోటు వేసుకుని ఫిషింగ్ కు వెళ్లడాన్ని ఆస్ట్రేలియన్లు బాగా ఆస్వాదిస్తారు. అలాగే ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఫిషింగ్ కు వెళ్లాడు. అయితే సముద్రం లోపలి వెళ్లకుండా.. ఒడ్డుకు దగ్గర్లో ఉన్న బోటుపై నిల్చుని గాలమేశాడు. అయితే అతని గాలానికి ఊహించని విధంగా సొరచేప పడింది. దాంతో, నెమ్మదిగా దానిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. సొరచేపను చూసి ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో దాని వెంట ఓ మొసలి కూడా బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి చేతిలోనున్న గాలంతో దాని ముఖం మీద కొట్టాడు. ఆ దెబ్బతో అది వెనుదిరిగింది. దీంతో తన స్నేహితులతో కలిసి చేపతో ఫోటోదిగి తరువాత దానిని నీట్లో వదిలేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో దానిని ఆసక్తిగా చూస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూడండి. 

  • Loading...

More Telugu News