: బాక్సింగ్ జరుగుతున్న చోట బాంబు పేలుళ్లు... 32 మందికి గాయాలు


ఫిలిప్సీన్స్ లోని హిలాంగోస్ పట్టణంలో బుధవారం రాత్రి రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రోమన్ కేథలిక్ హాలిడే కావడంతో ప్రజలు బాక్సింగ్  క్రీడను చూస్తున్నారు. ఆట జరుగుతున్న చోటే రెండు పేలుళ్లు జరిగాయి. దీంతో 32 మంది గాయాలపాలయ్యారు. 16 మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని, మరో 16 మంది ప్రాథమిక చికిత్స అనంతరం తమ ఇళ్లకు తిరిగి వెళ్లినట్టు పోలీసులు ఈ రోజు మీడియాకు తెలిపారు. గాయపడిన వారిలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి పోలీసులు ఓ కాట్రిడ్జ్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లకు కారకులు ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. 

  • Loading...

More Telugu News