: డెహ్రాడూన్ లో విహరిస్తున్న ప్రేమపక్షులు అనుష్క, కోహ్లీ!
బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి, ఆ తర్వాత బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ ప్రేమలో మునిగి తేలుతున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లిలో కూడా సందడి చేశారు. తాజాగా వీరు డెహ్రాడూన్ లో విహరిస్తుండగా దొరికిపోయారు. ఓ గుడి పూజారి వద్ద ఆశీస్సులు తీసుకుంటుండగా... ఓ అభిమాని ఫొటోను క్లిక్ మనిపించాడు. అయితే, ఈ ఫొటోను ఏ గుడిలో తీశారన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఈ జంట డెహ్రాడూన్ వెళ్లిందనే విషయం మాత్రం అర్థమవుతోంది.