: అమ్మ మృతిపై అనుమానాలు లేవు.. చిన్నమ్మపై వ్యతిరేకత లేదు!: అన్నాడీఎంకే నేత సరస్వతి
అమ్మ జయలలిత మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఏఐఏడీఎంకే నేత సరస్వతి తెలిపారు. చెన్నైలో పార్టీ సర్వసభ్య సమావేశానంతరం ఆమె మాట్లాడుతూ, అమ్మకు కష్టకాలంలో చిన్నమ్మ అండగా ఉన్నారని, ఇన్నేళ్లలో ఆమె ఏనాడూ పదవులు ఆశించలేదని అన్నారు. 'ఈ అర్హతలు చాలు ఆమె పార్టీ పగ్గాలు చేపట్టేందుకు' అని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదని ఆమె స్పష్టం చేశారు. బయటివారు, పార్టీ నుంచి తొలగించిన వారు ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. అమ్మను పార్టీ పగ్గాలు చేపట్టేదిశగా ఒప్పించారని, జనవరి 2న ఆమె పార్టీ పగ్గాలు చేపడతారని ఆమె చెప్పారు.