: పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయడంతో అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డా: 'అత్తారింటికి దారేది' నిర్మాత


సరిగ్గా 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కు జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తీసిన 'అత్తారింటికి దారేది' సినిమాకు కూడా ప్రసాదే నిర్మాత. అయితే, ఆ సినిమాకు సంబంధించి తన రెమ్యునరేషన్ ను ప్రసాద్ పూర్తిగా చెల్లించలేదంటూ ఫిలిం ఛాంబర్ కు పవన్ ఫిర్యాదు చేశారు. 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదలకు ముందు పవన్ ఫిర్యాదు చేయడంతో... ప్రసాద్ షాకయ్యారు.

అప్పుడు జరిగిన సంఘటన గురించి ప్రసాద్ తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని... కానీ, అలా ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఆ సమయంలో తాను అలాంటి పరిస్థితిలో ఉండటం తన దురదృష్టమని తెలిపారు. అయితే, 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ కు ముందు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయడంతో... తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News