: అనుమతిస్తే నిర్మాణాన్ని కూల్చేస్తాం... నటుడు అర్జున్ కపూర్ కు బీఎంసీ నోటీసు


బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసు జారీ చేసింది. అనుమతిస్తే తమ సిబ్బంది అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తారని నోటీసులో బీఎంసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో తొలి నోటీసు జారీ చేయగా... తాజా నోటీసులో మాత్రం కూల్చివేతపై హెచ్చరించడం విశేషం.

అర్జున్ కపూర్ జుహూ ప్రాంతంలోని రహేజా ఆర్చిడ్ లో ఏడవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి టెర్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలోకి చొచ్చుకువచ్చింది. అర్జున్ తనది కాని స్థలంలోకి ఇంటి పైకప్పు వచ్చేలా నిర్మాణం చేసి దానిపై కసరత్తులు చేసుకునేందుకు వీలుగా జిమ్ ఏర్పాటు చేశాడు. అనుమతులు లేకుండా 16 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేసినట్టు బీఎంసీ అధికారులు గుర్తించారు. అర్జున్ కపూర్ నిబంధనల అతిక్రమణ నిర్మాణంపై ఓ స్వచ్చంద సంస్థ కార్యకర్త బీఎంసీ దృష్టికి తీసుకెళ్లగా వారు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News